: టీడీపీ ప్రజాప్రతినిధులకు లేఖ రాసిన మావోయిస్టులు


విశాఖ మన్యం ప్రాంతంలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలవాలని, ఉద్యమంలో పాలుపంచుకోవాలని మావోయిస్టులు టీడీపీ ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ లేఖ వచ్చింది. బాక్సైట్ తవ్వకాల కారణంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సర్కారు స్వస్తి చెప్పాలని వారు లేఖలో కోరారు. లేకుంటే మచ్చరాజు, సోమలింగ, రవిశంకర్ లకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. లేఖ ప్రతులను టీడీపీ ప్రజాప్రతినిధుల కార్యాలయాలకు పంపారు.

  • Loading...

More Telugu News