: సుష్మ బాగా పనిచేస్తున్నారు... ఆమె రాజీనామా చేసే ప్రశ్నే లేదు: వెంకయ్య
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, ఆత్మరక్షణతో పాటు ఎదురుదాడికి ఎన్డీయే సర్కారు వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర కలకలం రేపిన లలిత్ మోదీ వ్యవహారంపై స్పందించారు. ఈ అంశంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. క్యాబినెట్లో ఆమె అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మంత్రి అని, ఆమె రాజీనామా చేయబోరని పేర్కొన్నారు. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వ్యవహారంలో ఆమె నైతికంగానూ, న్యాయపరంగానూ ఎలాంటి తప్పుచేయలేదని వెంకయ్య తెలిపారు. ప్రయాణ పత్రాల విషయంలో సుష్మ... లలిత్ మోదీకి సాయం చేశారని ఆరోపణలు రావడం తెలిసిందే. లలిత్ మోదీ భార్యకు యూకేలో ట్రీట్ మెంట్ అవసరమైనందునే సాయం చేశానని సుష్మ పేర్కొనడంతో విపక్షాలు మరింత భగ్గుమన్నాయి. ఆమె రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టాయి.