: భారత్ లో తయారైన బస్సులను యూరప్ దేశాలకు ఎగుమతి చేయనున్న వోల్వో
స్వీడిష్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో భారత్ లో తయారైన బస్సులను యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత్ లో తయారైన తొలి బస్సును ఈ ఏడాది చివర్లో యూరప్ లో ఆవిష్కరించనున్నట్టు వోల్వో బసెస్ అధ్యక్షుడు హకాన్ ఆగ్నెవల్ తెలిపారు. ప్రస్తుతం భారత్ లోని వోల్వో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లో తయారైన బస్సులను దక్షిణాసియా, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఐరోపా మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా భారత్ లోనూ నైపుణ్యవంతంగా బస్సులు తయారుచేసి, మరింత ముందుకెళతామని ఆగ్నెవల్ వివరించారు. వోల్వో బసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఆకాశ్ పస్సే మాట్లాడుతూ... మేకిన్ ఇండియా పథకం ద్వారా భారత్ లో ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమని అన్నారు.