: రహానే సేన క్లీన్ స్వీప్... మూడో వన్డేలోనూ ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో హరారేలో జరిగిన మూడో వన్డేలోనూ టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆతిథ్య జింబాబ్వే జట్టు 42.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. బిన్నీ 3 వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. జింబాబ్వే ఇన్నింగ్స్ లో చిభాభా 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీ హీరో జాదవ్ కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. కాగా, ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య ఇక రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనుంది.