: ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి తనయుడికి ఏసీబీ నోటీసులు
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా, టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణకు నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి బుధవారం ఉదయం 10.30 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అంతకుముందు, ఏసీబీ వేం నరేందర్ రెడ్డికి కూడా నోటీసులు పంపడం తెలిసిందే. ఓ రోజంతా ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం, అరెస్టు చేయకుండానే విడిచిపెట్టారు.