: బాహుబలి టీమ్ ను ఆకాశానికెత్తేసిన శంకర్... అది సర్టిఫికెట్ అన్న రాజమౌళి


'బాహుబలి' ఫ్యాన్స్ జాబితాలో మరో టాప్ డైరక్టర్ చేరారు. తమిళ అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ బాహుబలి చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. సినిమాలో పాత్రలను మలిచిన తీరు అమోఘమని, అద్భుతమైన ఆలోచనలు, కవితాత్మక ఊహలతో సినిమాకు ప్రాణం పోశారని, అన్నింటికీ మించి అసమాన హీరోయిజం చూపారని, మొత్తమ్మీద ఓ దృశ్య కావ్యంలా మలిచారని కితాబిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో దర్శకుడు రాజమౌళికి, యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. శంకర్ పొగడ్తను రాజమౌళి చాలా వినమ్రంగా స్వీకరించారు. "మీ మెచ్చుకోలుకు వేనవేల కృతజ్ఞతలు. మా యూనిట్ ఉప్పొంగిపోతోంది. మీ సందేశాన్ని మేం కేవలం ఓ పొగడ్తగానే చూడడం లేదు, మా సినిమాకు ఓ సర్టిఫికెట్ గా భావిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News