: రాజమండ్రి ఘటనపై న్యాయవిచారణకు చంద్రబాబు ఆదేశం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మంగళవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారం ప్రజల ప్రాణాలకు సంబంధించినదని, తేలిగ్గా తీసుకోరాదని ఆయన అధికారులను హెచ్చరించారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబునాయుడు పుష్కరాలు జరిగినన్ని రోజులు రాజమండ్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాగా, ఆయన ఢిల్లీలో బుధవారం జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. రాజమండ్రిలో విషాదఘటన నేపథ్యంలో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.