: ఫ్రాన్స్ కు మోదీ శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆ దేశ ప్రతినిధులతో తాను దిగిన ఫొటోను కూడా ఆయన పోస్టు చేశారు. ఆ ఫొటోకు తన శుభాకాంక్షల సందేశాన్ని జత చేశారు. ప్రజాస్వామ్యం, విలువల విషయాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని పేర్కొన్నారు. 'మున్ముందు, సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందాం, ప్రపంచ శాంతి కోసం కలిసి పోరాడదాం' అంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.