: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన సండ్ర
ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆదేశించిన రూ.2 లక్షల పూచీకత్తును ఆయన తరపు న్యాయవాది సమర్పించడంతో కొద్దిసేపటి కిందట ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. ఓటుకు నోటు కేసులో ఈరోజు సండ్రకు బెయిల్ మంజూరు చేసిన హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు పలు షరతులు విధించిన సంగతి తెలిసిందే.