: హైదరాబాద్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం


హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. తార్నాక, ఉస్మానియా యూనివర్శిటీ, లాలాపేట, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోలు, విద్యానగర్, ఇంకా పలు ప్రాంతాలలో ధాటిగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. నెలకుపైగా వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఈ రోజు కురుస్తున్న వర్షానికి రాజధాని వాసులు సేదతీరుతున్నారనే చెప్పాలి.

  • Loading...

More Telugu News