: అపజయాలకు కుంగిపోలేదు... అదే నా విజయ రహస్యం: సానియా


ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ తార సానియా మీర్జా భారత్ తిరిగివచ్చింది. మంగళవారం హైదరాబాదులో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తన విజయాన్ని దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్టు పేర్కొంది. అపజయాలకు ఎన్నడూ కుంగిపోలేదని, అదే తన విజయరహస్యమని తెలిపింది. కెరీర్ లో తొలిసారి వింబుల్డన్ గెలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. తన విజయం వెనుక కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని, డబుల్స్ పార్ట్ నర్ హింగిస్ ఎంతో సహకరించిందని వివరించింది. వింబుల్డన్ విజయం వెనుక పదేళ్ల శ్రమ ఉందని సానియా తెలిపింది.

  • Loading...

More Telugu News