: బ్లేజర్ లో బంగారం తరలిస్తూ... కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడిన ఐరిష్ జాతీయుడు


దేశ వ్యాప్తంగా బంగారం అక్రమ రవాణా పలు రకాలుగా సాగుతోంది. తాజాగా కొచ్చి విమానాశ్రయంలో తను ధరించిన బ్లేజర్ లో 10 కేజీల బంగారం తరలిస్తున్న ఓ ఐరిష్ జాతీయుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో తనిఖీలు నిర్వహించగా ఆండ్రూ అనే స్మగ్లర్ పట్టుబడ్డాడని అధికారులు తెలిపారు. కేజీ బరువున్న పది బంగారపు బిస్కెట్లను రహస్యంగా తరలిస్తుండగా అడ్డుకున్నామని చెప్పారు. ఇతను కేవలం పాత్రధారి మాత్రమేనని, స్మగ్లింగ్ గ్రూప్ లో అసలు సూత్రధారులు ఎవరో దర్యాప్తులో తెలుసుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News