: పరిపూర్ణానందస్వామికి పుష్కర ఘాట్ వద్ద చేదు అనుభవం


వివరణాత్మక ఆధ్యాత్మిక బోధనలతో ఆకట్టుకుంటారని పరిపూర్ణానందస్వామికి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఆయనకు ఎందరో భక్తులున్నారు. పుష్కరాల సందర్భంగా ఆయనకు రాజమండ్రిలో మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. పుష్కర స్నానం కోసం ఘాట్ వద్దకు రాగా, ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఘాట్ లో ప్రవేశించేందుకు పోలీసులు అంగీకరించలేదు. పోలీసుల వైఖరితో తీవ్ర నిరాశకు గురైన పరిపూర్ణానందస్వామి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన స్వామిజీతో ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News