: రాజమండ్రి పుష్కర ఘాట్ ల వద్ద తగ్గిన భక్తుల రద్దీ


తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల రద్దీ తగ్గింది. దాంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం తొక్కిసలాట జరిగిన కోటిలింగాల ఘాట్ వద్ద కూడా ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం నుంచి భక్తుల సంఖ్య క్రమంగా తగ్గడంతో ఘాట్ ల వద్ద రద్దీ తగ్గిపోయింది. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలను సందర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News