: జాదవ్ సూపర్ శతకం... జింబాబ్వే టార్గెట్ 277


జింబాబ్వేతో చివరి వన్డేలో టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. మిడిలార్డర్ లో వచ్చిన జాదవ్ 87 బంతులెదుర్కొని 12 ఫోర్లు, ఓ సిక్సు సాయంతో 105 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. యువ కెరటం మనీష్ పాండే (71) కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. బిన్నీ 18* పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో మడ్జివా 2 వికెట్లు పడగొట్టగా, చిభాభా, మసకద్జా, ఉత్సేయా తలో వికెట్ తీశారు. అంతకుముందు, 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ ను జాదవ్, పాండే జోడీ ఆదుకుంది. ఈ జంట ఐదో వికెట్ కు 144 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది.

  • Loading...

More Telugu News