: రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై గవర్నర్ ఆరా... బాబుకు ధైర్యం చెప్పిన నరసింహన్


పశ్చిమగోదావరి జిల్లా పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరు, మిగతా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు నరసింహన్ సంతాపం ప్రకటించారు. ఆపదకాల సమయంలో ధైర్యంతో ముందుకు సాగుదామని చంద్రబాబుకు గవర్నర్ ధైర్యం చెప్పినట్టు సమాచారం. అంతకుముందు ఈ దుర్ఘటన పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News