: చంద్రబాబు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సింది: జగన్
పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను వైకాపా అధినేత జగన్ కాసేపటి క్రితం రాజమండ్రిలో పరామర్శించారు. విజయవాడ పర్యటనలో ఉన్న జగన్ తొక్కిసలాట విషయం తెలిసిన వెంటనే, తన పర్యటనను ముగించుకుని హుటాహుటిన రాజమండ్రి వెళ్లారు. ఈ సందర్భంగా, జరిగిన అపశృతిపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు అసమర్థ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. భక్తుల భద్రత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం వెంటనే అందజేయాలని కోరారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని విన్నవించారు.