: పార్టీ నడిపేందుకు నిధుల్లేవు... సాయం చేయండి: ప్రజలకు కేజ్రీ విజ్ఞప్తి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు బహిరంగ విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద నిధులు నిండుకున్నాయని, పార్టీని నడపాలంటే నిధులు అవసరమని, ప్రజలు సాయం చేయాలని కోరారు. విరాళాలు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. ప్రస్తుతం పార్టీ రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బుల్లేవని దీనావస్థను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. "ఈ విధంగా విరాళాలు అడుగుతున్నందుకు మీరు అనొచ్చు... ఇతనేం ముఖ్యమంత్రి అని! తప్పడు మార్గంలో నిధులు అందుకునే వీలున్నా, మేం అలాంటి వాళ్లం కాదు. ప్రజలే మాకు నిధులందిస్తున్నారు. అవినీతి సొమ్ముకు ఎప్పుడూ ఆశపడలేదు. ప్రతి రూపాయికి రికార్డులు చూపించాం" అని పేర్కొన్నారు.