: ఎన్టీఆర్ విగ్రహం పెట్టినందుకు... 27 మంది బలయ్యారు: రఘువీరారెడ్డి
రాజమండ్రిలోని కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది చనిపోవడంపై రాజకీయ నేతలంతా తలా ఓ విధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొత్త పాయింట్ లేవనెత్తారు. పుష్కరఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని... ఇది అపచారమని చెప్పారు. ఎన్టీఆర్ ను చంపిన పాపాన్ని కడిగేసుకోవడానికి ఆయన విగ్రహాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారని... దీనికోసం, ఏకంగా 27 మందిని బలిచ్చారని ఆరోపించారు. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ, చంద్రబాబు రాజీనామా చేయాలని... లేకపోతే, ప్రజలకు క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్ చేశారు.