: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాం కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం పడింది. ఈ రెండు జట్లను ఐపీఎల్ నుంచి రెండు సంవత్సరాల పాటు నిషేధిస్తున్నట్టు ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఆర్.ఎం.లోథా కమిటీ తీర్పు వెల్లడించింది. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇక బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయ్యప్పన్ ను క్రికెట్ నుంచి, దాని సంబంధిత కార్యకలాపాల నుంచి జీవితకాలం నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇక బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజస్థాన్ సహ యాజమాని రాజ్ కుంద్రాపై కూడా నిషేధం విధిస్తున్నట్టు చెప్పింది. వారిద్దరు ఐపీఎల్ ప్రతిష్ఠను దిగజార్చారని లోథా కమిటీ స్పష్టం చేసింది. పంటర్ అనే వ్యక్తి ద్వారా కుంద్రా ఫిక్సింగ్ కు పాల్పడ్డారని, ఆయనపై ఆరోపణలు రుజువుకాలేదని కమిటీ పేర్కొంది.