: అవే కండిషన్లు... రేవంత్ కు విధించిన ఆంక్షలే సండ్రకూ వర్తింపు!


ఓటుకు నోటు కేసులో ఇద్దరు కీలక నిందితుల బెయిల్ కండిషన్లు ఒకేలా ఉన్నాయి. కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టులోనే బెయిల్ లభించింది. అయితే ఈ రెండు బెయిళ్ల కండిషన్లు మాత్రం ఒకే మాదిరిగా ఉన్నాయి. పూచీకత్తు సమర్పించి బయటకొచ్చిన తర్వాత తమ తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకూడదని ఇద్దరు నేతలకూ న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాక పాస్ పోర్టులను కూడా కోర్టుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో ఉంటుండగా, తాజాగా సండ్ర తన సొంత నియోజకవర్గం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనే వుండాలి.

  • Loading...

More Telugu News