: ఈసారి ఏకంగా సస్పెన్షనే!... యూపీ ఐపీఎస్ అధికారిపై అఖిలేశ్ సర్కారు కక్షసాధింపు
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పై విమర్శలు గుప్పించడమే కాక, కేసు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ములాయంపై కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే ఠాకూర్ పై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. అయితే ఈ కేసును తేలిగ్గా కొట్టిపారేసిన ఠాకూర్ ను ఏకంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అఖిలేశ్ యాదవ్ సర్కారు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణారాహిత్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు, హైకోర్టు ధిక్కారం తదితర ఆరోపణల కింద ఠాకూర్ పై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, రాష్ట్ర రాజధాని లక్నో వదిలివెళ్లరాదని ఆయనపై ఆంక్షలు విధించింది.