: కంటతడి పెట్టిన చంద్రబాబు... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా


పుష్కర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి అపశృతి దొర్లకుండా పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని; అయినప్పటికీ, తొక్కిసలాట జరిగి, పలువురు ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆయన కంటతడి పెట్టారు. ఇప్పటి వరకు 27 మంది చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. తొక్కిసలాటకు కారణమైన వారిని గుర్తిస్తామని, పుష్కరాల తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే పుష్కరాలు పూర్తయ్యేంత వరకు రాజమండ్రిలోనే ఉంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News