: పుష్కరఘాట్ వద్ద ప్రమాదానికి చంద్రబాబే బాధ్యత వహించాలి: జ్యోతుల నెహ్రూ, అంబటి


రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులే బాధ్యత వహించాలని వైకాపా నేతలు అంబటి రాంబాబు, జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. పుష్కరాల నిర్వహణకు వందల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం... చివరకు విఫలం కావడం శోచనీయమని అన్నారు. భారీగా తరలి వస్తున్న భక్తులను నియంత్రించడంలో విఫలం కావడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందని వారు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా వెంటనే వైద్య సాయం అందించలేకపోయారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News