: ప్రేమించలేదని యువతి... అడ్డువచ్చిందని ఆమె సోదరిపై ఉన్మాది దాడి


భాగ్యనగరి హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రేమోన్మాది దాడి చోటుచేసుకుంది. చైతన్యపురిలోని కొత్తపేటలో జరిగిన ఈ ఘటనలో ప్రేమోన్మాదంతో ఊగిపోయిన ఓ యువకుడు ఇద్దరు యువతలపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించలేదన్న కారణంగా ఓ యువతిపై దాడికి దిగిన ఉన్మాదిని బాధితురాలి సోదరి అడ్డుకుంది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ దుర్మార్గుడు అక్కాచెల్లెళ్లిద్దరిపై దాడికి తెగబడ్డాడు. ఉన్మాది దాడిలో గాయాలపాలైన యువతులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News