: 10కి చేరిన పుష్కర మృతుల సంఖ్య... మరో 20 మంది పరిస్థితి విషమం


అఖండ గోదావరి పుష్కరాల్లో అపశృతి దొర్లింది. పుష్కరాల తొలిరోజే హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ లో మూడు గేట్ల నుంచి భక్తులు భారీ ఎత్తున తోసుకుంటూ రావడంతో... అప్పటికే పుష్కరస్నానం చేసిన వారు బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో, ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మృత్యువాత పడిన భక్తుల సంఖ్య 10కి చేరింది. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం పుష్కర ఘాట్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘాట్ వద్ద రద్దీని కంట్రోల్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News