: విశ్వనాథన్ దేశం గర్వించదగ్గ కళాకారుడు: చంద్రబాబు సంతాపం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మరణం పట్ల టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై మలార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వనాథన్ నేటి ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో నేటి ఉదయం గోదావరి పుష్కరాలను ప్రారంభించిన అనంతరం విశ్వనాథన్ మృతి వార్త తెలుసుకున్న చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. విశ్వనాథన్ దేశం గర్వించదగ్గ కళాకారుడని చంద్రబాబు కీర్తించారు.