: రాజమండ్రి పుష్కర ఘాట్ లో తొక్కిసలాట... ముగ్గురు మహిళల దుర్మరణం


గోదావరి పుష్కరాలు ప్రారంభమైన గంటల్లోనే అపశ్రుతి చోటుచేసుకుంది. తొలిరోజునే పుష్కర స్నానం చేయాలన్న భావనతో నేటి ఉదయానికే గోదావరి తీరం వెంబడి ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లకు జనం పోటెత్తారు. దీంతో తీవ్ర రద్దీ నెలకొంది. రాజమండ్రి పుష్కర ఘాట్ లో నేటి ఉదయం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పుష్కర స్నానం చేసి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. పుష్కర ఘాట్ మొదటి ద్వారం వద్ద కొందరు గోడ ఎక్కే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలై ముగ్గురు మహిళలు చనిపోయారు. మరికొంత మంది సొమ్మసిల్లిపడిపోయారు. కాస్త ఆలస్యంగా ప్రమాదాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు వెనువెంటనే రంగంలోకి దిగి సొమ్మసిల్లినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News