: ఐరా... భళా!: సివిల్స్ టాపర్ కు చంద్రబాబు అభినందన
ఐరా సింఘాల్... వికలాంగురాలైనా ఈ ఏటి సివిల్స్ టాపర్ గా నిలిచి ఔరా అనిపించింది. పట్టుదల ఉంటే, శారీరక వైకల్యం అడ్డురాదని ఆమె నిరూపించింది. ఐరా సింఘాల్ ఘన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఇప్పటికే ఆమెను అభినందిస్తూ సందేశం పంపారు. అయినా ఆయన ఈ విషయంలో సంతృప్తి చెందలేదట. నిన్న ఐరా సింఘాల్ ను తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ చంద్రబాబు మరోమారు అభినందించారు. తన ఆఫీసుకు వచ్చిన ఐరా సింఘాల్ కు పుష్పగుచ్చం అందించిన చంద్రబాబు, యువతరానికి నీవే ఆదర్శమంటూ భుజం తట్టారు.