: కేరళలో ప్రొటోకాల్ రగడ... మంత్రికి ఐపీఎస్ సెల్యూట్ చేయలేదట!
కేరళలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. కేరళ రాష్ట్ర పోలీస్ అకాడమీలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా హోం మంత్రి రమేశ్ చెన్నితాలకు అదనపు డీజీపీ రిషిరాజ్ సింగ్ సెల్యూట్ చేయలేదని, ప్రొటోకాల్ పాటించలేదని కేరళ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంత్రి కార్యక్రమ వేదికపైకి వస్తున్న సమయంలో, రిషిరాజ్ కూర్చునే ఉన్నారట. దీనికి సంబంధించిన ఫోటో న్యూస్ పేపర్లలో వచ్చింది. దానిపై రిషిరాజ్ వివరణ ఇస్తూ, తనకు అందిన ఆహ్వాన లేఖలో జాతీయగీతం వచ్చినప్పుడు మాత్రమే లేచి నిలబడాలని ఉందని, అయినా, తాను వేదికపై ముందు కూర్చుని ఉన్నానని, వెనుకనుంచి వస్తున్న మంత్రిని ఎలా చూస్తానని అన్నారు. దీంతో, సీఎం ఊమెన్ చాందీ అసహనానికి గురయ్యారు. దీనిపై శాఖాపరమైన చర్యలకు సర్కారు కసరత్తులు చేస్తోంది. అయితే, రిషిరాజ్ కు విపక్షాలు, నెటిజన్లు మద్దతు ప్రకటించడం విశేషం.