: 'కోచింగ్ విషయం' మాట్లాడేందుకు వెళ్లా... బీసీసీఐ నిర్ణయం షాక్ కలిగించింది: ముంబయి క్రికెటర్ హికెన్ షా
ఐపీఎల్ లో అవినీతికి పాల్పడ్డాడంటూ ముంబయి రంజీ ఆటగాడు హికెన్ షాపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేయడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. దీనిపై హికెన్ షా స్పందించాడు. బీసీసీఐ నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించిందన్నాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు. ఈ విషయమై బీసీసీఐకి వివరణ ఇచ్చానని, చెప్పేందుకు అంతకుమించి ఇంకేమీ లేదని అన్నాడు. తాను ప్రవీణ్ తాంబేను కలిసింది నిజమేననని, అయితే, కోచింగ్ అంశమై తాంబేను కలిశానని తెలిపాడు. అసలేం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. ప్రస్తుతం హికెన్ షా ఇంగ్లాండ్ లో క్లబ్ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నాడు.