: కేసీఆర్ పుష్కర స్నానం చేయరాదంటున్న వేద పండితులు!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పుష్కర స్నానానికి విఘాతం ఏర్పడింది. ఆయన పుష్కరస్నానంపై పండితులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సోదరుడు వెంకట్ రావు భార్య రెండు రోజుల క్రితం కన్నుమూశారు. దాంతో, కేసీఆర్ కు మైల ఉంటుందని, ఆయన పుష్కర స్నానం చేయరాదని వేద పండితులు అంటున్నారు. వెంకట్ రావును కేసీఆర్ తండ్రి దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ పుష్కరాల నిమిత్తం ధర్మపురిలో ఉన్నారు.