: రాజమండ్రి పుష్కర ఘాట్ వద్దకు చంద్రబాబు దంపతులు రాక... నిత్యహారతి కోసం పోటెత్తిన భక్తులు
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి పుష్కరకళ వచ్చింది. రాజమండ్రి గోదావరి తీరంలోని పుష్కర్ ఘాట్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వారు తిలకించారు. ఇక, నిత్యహారతి కోసం భక్తులు పోటెత్తారు. విద్యుద్దీప కాంతులతో గోదావరి తీరం మెరిసిపోతోంది. కాగా, పుష్కర ఘాట్ వద్ద వృద్ధులు, పిల్లల కోసం షవర్ బాత్ సౌకర్యం కల్పించారు. అటు, పిండ ప్రదానాల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. పుష్కరాలు మంగళవారం ఉదయం 6.26 నిమిషాలకు ఆరంభం కానున్నాయి.