: ప్రతి ఒక్కరూ గోదావరి తల్లిని మొక్కుకోవాలి: చంద్రబాబు
గోదావరి పుష్కరాలు తెలుగువారందరికీ పవిత్రమైన పండుగని... రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ గోదావరి తల్లిని మొక్కుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పుష్కరాల కోసం ఉభయగోదావరి జిల్లాల్లో భారీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. వ్యాపారులెవరూ అధిక ధరలకు వస్తువులను అమ్మరాదని... ప్రజలతో అధికారులు సఖ్యతతో మెలగాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీని తొలగించామని చెప్పారు. గోదావరి పుష్కరాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. పుష్కర ఘాట్ల వద్ద డ్వాక్రా మహిళలతో స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 10 పుష్కర నగరాలు, 270 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.