: 'టీఆర్ఎస్.. తాగి ఊగే పార్టీ' అంటోన్న టీడీపీ నేత
'తెలుగుదేశం.. పాలుకూరగాయలు అమ్ముకునే పార్టీ' అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ నర్సారెడ్డి ఘాటుగా స్పందించారు. 'టీఆర్ఎస్.. తాగి ఊగే పార్టీ' అని దీటుగా బదులిచ్చారు. 'తాగకుండా ఉండలేని పార్టీ మీది' అంటూ విరుచుకుపడ్డారు. ఆయన నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా బెదిరింపు రాజకీయాలు నెరుపుతున్నారని నర్సారెడ్డి ఆరోపించారు. ఉద్యమంలో శ్రమించడం తెలీని కేసీఆర్ కు చంద్రబాబును విమర్శించడం తగదని ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ బలహీనమైన పార్టీ కనుకనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆకర్షించేందుకు యత్నిస్తోందని నర్సారెడ్డి విమర్శించారు. టీడీపీ కష్టపడి పనిచేసే పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.