: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట... జీతాలు చెల్లించాలని 'టీ.ట్రాన్స్ కో'కు ఆదేశం


తెలంగాణ ట్రాన్స్ కో రిలీవ్ చేసిన 1252 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి రావల్సిన జూన్ నెల జీతాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ ట్రాన్స్ కోను ఆదేశించింది. ఈ మేరకు తమను రిలీవ్ చేస్తూ టీ.ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే తొలగించాలంటూ ఉద్యోగులు దాఖలు చేసిన సర్వైవల్ పిటిషన్ పై విచారణ జరిగింది. గత రెండు రోజుల నుంచీ పిటిషన్ పై వాదప్రతివాదనలు జరిగాయి. స్పందించిన కోర్టు పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. స్థానికత ఆధారంగా తెలంగాణ ట్రాన్స్ కోలో పనిచేస్తున్న ఏపీ విద్యుత్ ఉద్యోగులను గత నెలలో రిలీవ్ చేశారు. దానిపై అప్పుడే హైకోర్టుకు వెళ్లగా స్టే విధించింది. అయినప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. అటు కేంద్ర మంత్రులకు కూడా ఉద్యోగులు తమ సమస్యను విన్నవించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News