: అమెరికన్ టీచర్ ను హత్యచేసిన మహిళను ఉరితీసిన యూఏఈ
ఉగ్రవాద చర్యలను తీవ్రంగా నిరసించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈరోజు ఓ ఉగ్రవాద మహిళను ఉరితీసింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడడం, ఓ టీచర్ ను గతేడాది దారుణంగా హత్య చేయడం వంటి నేరాలకు గాను ఆమెకు ఈ శిక్ష అమలు చేశారు. డిసెంబర్ 4, 2014న బోల్యా ర్యాన్ అనే అమెరికా టీచర్ ను అబుదాబిలోని షాపింగ్ మాల్ టాయిలెట్ వద్ద అలా బాదర్ అబ్దుల్లా అల్ హషిమి(31) అనే మహిళ కత్తితో పొడిచి హత్య చేసింది. చనిపోయిన మహిళకు ఇద్దరు కవలపిల్లలున్నారు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన అమెరికన్ ఈజిప్టు వైద్యుడిపై కూడా హషిమి హత్యాయత్నం చేసింది. అంతేగాకుండా ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో ఆమె ప్రచారం చేస్తుందని తెలుసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు విచారణ చేసిన యూఏఈ కోర్టు ఉగ్రవాద మహిళకు ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను తాజాగా అమలు చేశారు.