: ఆ టెర్రరిస్టులను మీతో పాటే విమానంలో తీసుకురండి: మోదీకి అజమ్ ఖాన్ విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీ సార్క్ దేశాల సదస్సు కోసం పాకిస్థాన్ వెళితే, తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కూడా తీసుకురావాలని అంటున్నారు ఉత్తరప్రదేశ్ మంత్రి అజమ్ ఖాన్. గతంలో వారిని విమానంలో ఖాందహార్ ఎలాగైతే తీసుకెళ్లారో, ఇప్పుడు వారిని అదే రీతిలో భారత్ కు తీసుకురావాలని అన్నారు. అప్పట్లో ఓ విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేయడంతో భారత్ మౌలానా మసూద్ అజహర్ సహా ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్థాన్ లోని ఖాందహార్ కు విమానంలో తీసుకెళ్లడం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అజమ్ ఖాన్ పైవిధంగా పేర్కొన్నారు. 155 మందితో కూడిన ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఐసీ-814 విమానం హైజాక్ కు గురికాగా, అప్పటి భారత ప్రభుత్వం ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాల కోసం జైల్లో ఉన్న తీవ్రవాదులను విడిచిపెట్టింది.