: అజెండాలో కాశ్మీర్ ఉండాలి... లేకపోతే భారత్ తో చర్చలు జరపలేం: వంకర బుద్ధిని బయటపెట్టిన పాక్
పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. కాశ్మీర్ అంశాన్ని అజెండాలో ఉంచకపోతే భారత్ తో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఆత్మగౌరవం విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదంటూ ట్యాగ్ కూడా తగిలించింది. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షరీఫ్ ల మధ్య జరిగిన సమావేశం గురించి పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య చర్చలు జరగడం మంచిదే అయినప్పటికీ, సరిహద్దులో ఉద్రిక్తతలను చల్లార్చడమే కీలకమని చెప్పారు. ముంబై ఉగ్రదాడి కేసులో లష్కరే తాయిబా కమాండర్ లఖ్వీ గురించి స్పందిస్తూ... కేసుకు సంబంధించి భారత్ నుంచి మరింత సమాచారం కావాలని అన్నారు. అలాగే, మోదీతో భేటీ సందర్భంగా... సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుడు విషయంలో తమకు సమాచారం కావాలని షరీఫ్ కోరారని తెలిపారు.