: బస్సులో బాహుబలి సీడీలు పట్టివేత


భారీ బడ్జెట్ సినిమా బాహుబలి పైరసీ నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమార్కుల జోరుకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, ఓ బస్సులో బాహుబలి పైరసీ సీడీలు పట్టుబడ్డాయి. చిత్తూరు నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు బస్సులో 50 సీడీలను స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సీడీల సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు, ఆదివారం నాడు హైదరాబాదు పాతబస్తీలో బాహుబలి పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్ లో పలు సీడీల షాపులపై దాడి చేసిన పోలీసులు 115 సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News