: గోదావరి పుష్కరాలకు రాజకీయ పార్టీలన్నింటికీ ఏపీ ప్రభుత్వ ఆహ్వానం
రాజకీయ పార్టీలన్నింటినీ గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు పార్టీల అధ్యక్షులకు మంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు. బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీ అధ్యక్షులకు పుష్కరాల ఆహ్వానం అందింది. అంతేగాక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా మంత్రి ఫోన్ ద్వారా పుష్కరాలకు ఆహ్వానించారు. ఈ నెల 14 నుంచి 25 వరకు పుష్కరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.