: మరోసారి వణుకుతున్న ప్యారిస్... 10 మందిని బంధించిన సాయుధుడు
వరుస ఉగ్ర దాడులతో భయాందోళనలకు గురవుతున్న ఫ్రాన్స్ మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ లోకి ఈ ఉదయం 6.30 గంటల సమయంలో ఓ సాయుధుడు చొరబడ్డాడు. మాల్ లో ఉన్న 10 మందిని బందీలుగా ఉంచుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయంతో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.