: రాజమౌళి ఇక్కడ పుట్టాడని తెలుగు వారు గర్వించాల్సిన అవసరం లేదు: రామ్ గోపాల్ వర్మ


'బాహుబలి' చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమాను రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడాడు. తమకంటే గొప్పవాళ్లు లేరని విర్రవీగుతున్న హీరోలకు ఈ సినిమా కనువిప్పు కలిగించిందని అన్నాడు. రానున్న రోజుల్లో స్టార్ హీరోల పెద్ద సినిమాలన్నీ కూడా బాహుబలి ముందు 'లో బడ్జెట్' సినిమాలుగా మారనున్నాయని చెప్పాడు. బాహుబలిలో ప్రభాస్ టెర్రిఫిక్ గా ఉన్నాడని... రానా అయితే పర్మామెన్స్ పరంగా ఒక పర్వతంలా కనిపించాడని చెప్పాడు. రాజమౌళి ఇక్కడ పుట్టినందుకు తెలుగువారు గర్వించాల్సిన అవసరం లేదని... ఏ బాంబేలోనే లేక లాస్ ఏంజెలెస్ లోనో పుట్టనందుకు రాజమౌళి ఎంతో దురదృష్టవంతుడని చెప్పాడు. హీరో కంటే కూడా కథే గొప్పదని బాహుబలి నిరూపించిందని... ఈ విషయాన్ని దశాబ్దాల క్రితమే హాలివుడ్ గుర్తించిందని తెలిపాడు.

  • Loading...

More Telugu News