: సండ్ర బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. సండ్ర కస్టడీ ముగిసిందని, ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు బెయిల్ పై ఉన్నారని, ఈ క్రమంలో సండ్రకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఇటు ఏసీబీ తరపు లాయర్ వాదిస్తూ, ఎమ్మెల్యేగా తన బాధ్యతలను సండ్ర దుర్వినియోగం చేశారని, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చాకే సండ్ర ఏసీబీ ఆఫీస్ కు వచ్చారని చెప్పారు. మరికొందరితో ఆయన సంభాషణలు జరిపినట్టు ఆధారాలున్నాయని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, బెయిల్ ఇవ్వొద్దంటూ ఏసీబీ లాయర్ వాదించారు.