: పాలమూరు ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు


మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు రాజ్ భవన్ లో నరసింహన్ ను కలిశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికే తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది.

  • Loading...

More Telugu News