: ఈసారి బంద్ కు దూరంగా జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదులు... 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
జులై 13న జరగాల్సిన సమ్మెకు ఈసారి జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదులు పిలుపునివ్వలేదు. ఆశ్చర్యకరమే అయినప్పటికీ, ఇది నిజం. రంజాన్ మాసం ఉపవాస దీక్షల నేపథ్యంలో వేర్పాటువాద నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. 1931 జులై 13న శ్రీనగర్ సెంట్రల్ జైలు బయట జరుగుతున్న ఆందోళనలను కంట్రోల్ చేయడానికి ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 21 మంది ముస్లిం నిరసనకారులు చనిపోయారు. ఈ ఘటనను నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్ లో అప్పటి నుంచి ప్రతి యేటా జులై 13న సెలవు దినంగా పాటిస్తున్నారు. వేర్పాటువాదులైతే ఏకంగా అమరుల దినంగా అభివర్ణిస్తూ, ప్రతియేటా సమ్మెను నిర్వహిస్తారు. కానీ, రంజాన్ మాసం సందర్భంగా, ఈసారి ఎలాంటి సమ్మెను నిర్వహించకూడదని... జేకేఎల్ఎఫ్ ఛైర్మన్ యాసిన్ మాలిక్, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా జిలానీలు నిర్ణయించారు. 25 ఏళ్ల తర్వాత సమ్మె కొనసాగకపోవడం ఇదే తొలిసారి.