: కిలో బెండకాయలు రూపాయే... రోడ్డెక్కిన రైతన్నలు... ట్రాఫిక్ జామ్


హైదరాబాదుతో పాటు అన్ని పట్టణాల్లో కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొందామన్నా కిలో పాతిక రూపాయలకు పైనే ఉంది. కానీ, కష్టించి, పంట పండించిన రైతన్నలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతోంది. మార్కెట్లలోని వ్యాపారులు, దళారీలు కుమ్మక్కై రైతుల దగ్గర్నుంచి కిలో బెండకాయలు రూపాయికే కొంటున్నారు. దీంతో, రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ శ్రమను దోచుకుంటున్న వారిపై నిరసనగా రైతులు రోడ్డెక్కారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఉన్న దొమ్మేరులో చోటు చేసుకుంది. తాము పండించిన బెండకాయలను రోడ్డుపై పోసిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో, ట్రాఫిక్ జామ్ అయి, రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News