: తిరుమలలో భక్తులపై కొండముచ్చుల దాడి... పలువురికి తీవ్ర గాయాలు
తిరుమలలో కొండముచ్చులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఉదయం తిరుమలలోని జీఎన్ టీ టోల్ గేట్ ప్రాంతంలో నడకదారి భక్తులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా వారి కాళ్లకు గాట్లుపడ్డాయి. వారిలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఒకరు ఉన్నారు. గాయాలైన వారిని దగ్గరలోని అశ్విని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కొండముచ్చులు దాడులు చేస్తున్నాయని, ఇప్పటివరకు ఏడుగురు భక్తులకు గాయాలయ్యాయని తెలిసింది. ఈ క్రమంలో అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడకదారి భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.