: రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం... 12 గంటల నుంచి భక్తులకు దర్శనం


రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవెంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటయిన ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారి విగ్రహాన్ని టీటీడీ అర్చకులు ఈ ఉదయం ప్రతిష్ఠించారు. అంతకుముందు సరస్వతీ ఘాట్ నుంచి గోదావరి జలాలను మేళ వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనల మధ్య పండితులు ఆలయానికి తీసుకొచ్చారు. పలు రకాల పూలతో అలంకరించిన ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News