: జయలలితకు ఏమైంది?... తమిళనాట చర్చనీయాంశంగా మారిన జయ ఆరోగ్య పరిస్థితి
ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏమైంది? తమిళనాడులో ఏ ఇద్దరు కలుసుకున్నా ఇదే చర్చ. జయ ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడులో అనేక ప్రచారాలు ఊపందుకున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్సులకు కూడా ఆమె హాజరుకాకపోవడం... వదంతులకు మరింత ఊతమిస్తోంది. డీఎంకే అధినేత కరుణానిధి కూడా కొద్ది రోజుల క్రితం జయ ఆరోగ్యం గురించి మాట్లాడారు. అలాగే ఇళంగోవన్, తిరుమావళన్ తదితర నేతలు కూడా ఇదే అంశంపై వ్యాఖ్యానించారు. డీఎంకే నేత స్టాలిన్ మరో అడుగు వేసి అసలు తమిళనాడులో ప్రభుత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన జయ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఘాటుగా స్పందించారు. మరోవైపు, జయ వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా చర్చించడం మంచిది కాదని బీజేపీ సూచించింది.